రెసిడెన్సీ ఉల్లంఘనులకు క్షమాభిక్ష లేదు

- November 12, 2021 , by Maagulf
రెసిడెన్సీ ఉల్లంఘనులకు క్షమాభిక్ష లేదు

కువైట్: రెసిడెన్సీ ఉల్లంఘనులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్తగా క్షమాభిక్ష పెట్టేది లేదని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది. కోవిడ్ నేపథ్యంలో మానవీయ కోణంలో నాలుగుసార్లు క్షమాభిక్షకు అవకాశం కల్పించినట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఎలాంటి జరీమానా చెల్లించకుండా, ఉచితంగా టిక్కెట్లను కల్పించి మరీ దేశం విడిచి వెళ్ళేందుకు కొందరికి అవకాశం కల్పించిన కువైట్, కొందరు ఉల్లంఘనులు తమ స్టేటస్ సరి చేసుకునేందుకూ అవకాశం ఇచ్చింది. అయినాగానీ, సుమారుగా 160,000 మంది ఉల్లంఘనులు క్షమాభిక్షను వినియోగించుకోలేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని అథారిటీస్ స్పష్టం చేశాయి. జరీమానా చెల్లించి ఉల్లంఘనులు దేశం విడిచి వెళ్ళాలనీ, అనంతరం వారు కొత్త వీసాపై తిరిగి వచ్చేందుకు అవకాశం వుందని కువైట్ పేర్కొంది. అలా ముందుకు రాని వారిని అథారిటీస్ గుర్తించి పట్టుకుని, దేశం నుంచి పంపేస్తే, వారిపై జీవిత కాలం బ్యాన్ వుంటుందని అధికారులు తెలిపారు. వారు జిసిసి దేశాలకు ఐదేళ్ళ వరకు వచ్చేందుకు వీలుండదని కువైట్ స్పష్టం చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com