సౌదీ ఆర్థిక వ్యవస్థ రికార్డు వృద్ధి.. దశాబ్దంలోనే అత్యధికం
- November 13, 2021
సౌదీ: సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ మూడవ త్రైమాసికంలో మంచి ఫలితాలను నమోదు చేసింది. గత దశాబ్ద కాలంలో ఇది అత్యధికం కావడం విశేషం. అధిక చమురు ధరల కారణంగానే ఇది సాధ్యమైందని ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారం తెలుస్తోంది. 2020 ఇదే త్రైమాసికంతో పోల్చితే స్థూల దేశీయోత్పత్తి 6.8 శాతం పెరిగింది. అంతకుముందు 2012లో ఇంతకంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. అప్పుడు చమురు ధరలు బ్యారెల్‌కు సగటున $122 ఉండేవి. గత మూడు నెలలతో పోలిస్తే వృద్ధి 5.8 శాతం పెరిగింది. చమురు రంగం సంవత్సరానికి 9 శాతం చొప్పు వృద్ధి నమోదు చెందగా.. చమురుయేతర ఆర్థిక వ్యవస్థ - ఉద్యోగ సృష్టి సెక్టర్లు 6.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అయితే చమురుయేతర కార్యకలాపాలు ఊహించిన దానికంటే తక్కువ వృద్ధిని నమోదు చేసింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 1.6 శాతం మాత్రమే పెరుగుదల నమోదైంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







