స్మగ్లింగ్ గుట్టు రట్టు.. 2.3 మిలియన్ల నార్కోటిక్ పిల్స్ స్వాధీనం
- November 13, 2021
సౌదీ: సౌదీ అరేబియా కస్టమ్ అధికారులు భారీ స్మగ్లింగ్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న 2.3 మిలియన్ల నార్కోటిక్ పిల్స్(ఫెనెథిలిన్ పిల్స్) ను రియాద్ - సౌదీ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అల్-హదితలోని జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ (ZATCA) తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో హదీత పోర్ట్ నుంచి ఓ ట్రక్కులో 2,302,325 నిషేధిత మాత్రలను దాచి రహస్యంగా సౌదీలోకి తీసుకొస్తున్న క్రమంలో కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దిగుమతులు, ఎగుమతులపై కస్టమ్స్ నియంత్రణను కఠినతరం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ను అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (GDNC)తో కలిసి పనిచేస్తున్నట్లు ZATCA అధికారులు స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల స్మగ్లింగ్ గురించిన సమాచారం తెలిస్తే అత్యవసర నంబర్ (1910), ఇ-మెయిల్ ([email protected]) లేదా అంతర్జాతీయ నంబర్ (00966114208417) ద్వారా తెలపాలని అధికారులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, వారికి తగిన రివార్డు కూడా అందించబడుతుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







