అదరగొడుతున్న లుక్ లో 'ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా' అంటూ వచ్చేస్తున్న బన్నీ..
- November 14, 2021
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' చిత్రంపై ఒక రేంజ్ లో హైప్ ఉంది. డిసెంబర్ 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, బన్నీ కాంబినేషన్ కావడంతో.. పైగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ పాటలు యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. తొలిసారి అల్లు అర్జున్ రగ్గడ్ లుక్ లో, ఊర మాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ పుష్ప చిత్రంలోని నాల్గవ పాట అప్డేట్ ఇచ్చింది.
'ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా' అంటూ సాగే పాటని నవంబర్ 19న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీని కోసం విడుదల చేసిన పోస్టర్ బన్నీ అభిమానులకు సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ మరో డిఫెరెంట్ లుక్ లో మాస్ స్టైల్ లో అదరగొడుతున్నాడు. ఒక డాన్ తరహాలో బన్నీ ఇస్తున్న ఫోజు కిక్కిచ్చేలా ఉంది.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రతి పాట సూపర్ హిట్ అవుతుండడంతో చిత్ర యూనిట్ హ్యాపీగా ఉంది. బన్నీ నుంచి సాంగ్ వస్తే యూట్యూబ్ లో రికార్డులు మోతెక్కుతున్నాయి. మరి నాల్గవ సాంగ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. బన్నీకి జోడిగా రష్మిక మందన నటిస్తోంది. ఎర్రచందనంని అక్రమంగా తరలించే లారీ డ్రైవర్ గా ఉండే పుష్పరాజ్.. స్మగ్లింగ్ సామ్రాజ్యానికి డాన్ గా మారుతాడా ? బహుశా అయిఉండొచ్చు.. ఈ పోస్టర్ ని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
#PushpaFourthSingle 🤘#PushpaTheRise #PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @anusuyakhasba @ThisIsDSP @adityamusic @PushpaMovie pic.twitter.com/6qW29fZybK
— Mythri Movie Makers (@MythriOfficial) November 14, 2021
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







