ప్రపంచ కప్ కైవసం చేసుకున్న ఆసీస్.!
- November 15, 2021
దుబాయ్: దుబాయ్ క్రికెట్ స్టేడియం లో ఈరోజు జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది ఆస్ట్రేలియా జట్టు. అయితే నేటి ఫైనల్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ విలియమ్సన్(85) పరుగులతో రాణించడం వల్ల ఆ జట్టు 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. ఆ తర్వాత 173 పరుగుల లక్ష్యంతో వచ్చిన ఆసీస్ జట్టు కెప్టెన్ ఫించ్ కేవలం 5 పరుగులు చేసే ఔట్ అయిన మరో ఓపెనర్ వార్నర్ (53) అర్ధశతకం పూర్తి చేసాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్ అద్భుతంగా రాణిస్తూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. మార్ష్ 50 బంతుల్లో 77 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో ఉండగా మాక్స్‌వెల్ 18 బంతుల్లో 28 పరుగులు చేసాడు. ఇక ఆసీస్ కు చివరి 14 బంతుల్లో 4 పరుగులు కావాల్సి ఉండగా… మాక్స్‌వెల్ బౌండరీతో ఆసీస్ జట్టు మొదటిసారి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను గెలుచుకుంది. దాంతో ఆసీస్ ఆటగాళ్లు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







