హజ్‌ యాత్రికుల ఎంపికకు డ్రా

- March 21, 2016 , by Maagulf
హజ్‌ యాత్రికుల ఎంపికకు డ్రా

హజ్‌ యాత్రకు వెళ్లే వారిని డ్రా ద్వారా ఎంపిక చేయనున్నామని తెలంగాణ రాష్ట్ర హజ్‌ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో జరిగే డ్రాలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీతోపాటు కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారు లు పాల్గొంటారని పేర్కొంది. రాష్ట్రం నుంచి 2532 మంది యాత్రికులను హజ్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా కేటాయించింది. ఇందులో ఇప్పటికే 2204 మంది రెండు రిజర్వుడు కేటగిరీల కింద ఎంపిక చేశారు. 2016 సంవత్సరంలో మొత్తం 17,423 దరఖాస్తులు హజ్‌ వెళ్లేందుకు వచ్చాయని హజ్‌ కమిటీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com