కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తైన విదేశీయులకే ఉమ్రాకు వచ్చేందుకు అనుమతి
- November 20, 2021
సౌదీ: ఉమ్రా యాత్రకు వచ్చే విదేశీయులకు సౌదీ హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను ప్రకటించింది. 18 నుండి 50 సంవత్సరాల వయస్సు గల వారికి మాత్రమే ఈ ఉమ్రా యాత్ర కొత్త నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించిన వ్యాక్సిన్ రెండు డోసులను విదేశీ యాత్రికులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎలక్ట్రానిక్ ఎంట్రీ వీసా పొందేందుకు యాత్రికులు తప్పనిసరిగా తమ టీకా సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా వీసా పొందవచ్చని ఉమ్రా, హజ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. యాత్రికులు ప్రయాణించే ముందు, తమ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ట్రావెల్ ఏజెంట్లతో ఓసారి తనిఖీ చేయించుకోవాలని సూచించారు. ఒక వ్యక్తి సౌదీ అరేబియా వెలుపల నుండి ఉమ్రా వీసా పొందాలనుకునే వారి కోసం సౌదీ మంత్రిత్వ శాఖ ‘‘ఈట్మార్నా, తవక్కల్నా’’ అనే రెండు యాప్ లను ప్రారంభించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులకు మాత్రమే గ్రాండ్ మసీదు, ప్రవక్త మసీదులో ఉమ్రా, ప్రార్థనలు నిర్వహించడానికి అనుమతుల జారీని పరిమితం చేయాలని అధికారులు నిర్ణయించినట్లు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీలో ఆమోదించబడిన వ్యాక్సిన్ రెండు డోసుల వ్యాక్సిన్‌ను పొందిన వారికి, వ్యాక్సిన్ తీసుకోకుండా మినహాయించబడిన కేసులకు మాత్రమే ప్రార్థనల నిబంధనలు పరిమితం అని మంత్రిత్వ శాఖ వివరించింది. రెండు వ్యాక్సిన్ మోతాదులను పూర్తి చేయకుండా ఉమ్రా, ప్రార్థన లేదా సందర్శన కోసం రిజర్వేషన్, పర్మిట్ జారీని పూర్తి చేసిన యాత్రికులు, పర్మిట్ తేదీకి 48 గంటల ముందు రెండవ డోస్ తీసుకోవాలని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







