నేటితో ముగియనున్న ఖతార్ ఇంటర్నేషనల్ బోట్ షో 2021
- November 20, 2021
ఖతార్: సందర్శులను విశేషంగా ఆకట్టుకున్న 8వ ఖతార్ ఇంటర్నేషనల్ బోట్ షో (QIBS) 2021 శనివారంతో ముగుస్తుంది. స్థానికంగా తయారు చేయబడిన టాప్ స్పెక్ లగ్జరీ యాచ్‌లు, స్పీడ్ బోట్‌లు ఈ షోలో సందర్శకులను ఆకట్టుకున్నాయి. దేశీయ సమద్ర పడవల తయారీ పరిశ్రమకు ఈ షో ద్వారా ప్రోత్సహం లభించిందని నిర్వాహకులు వెల్లడించారు. 20-22 వేదిక వద్ద లా క్రోయిసెట్, పోర్టో అరేబియా, ది పెర్ల్-ఖతార్, పెర్ఫార్మెన్స్ మెరైన్ గురువారం నాలుగు స్పీడ్ బోట్‌లను ప్రారంభించింది. ఇందులో 52'-పొడవు, 14'-వెడల్పు ఉన్న ఖతార్-నిర్మిత అతిపెద్ద స్పీడ్ బోట్ కూడా ఉంది. ఇది గంటకు 85 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పెర్ఫార్మెన్స్ మెరైన్ చైర్మన్ షేక్ హసన్ బిన్ జబోర్ అల్-థానీ మాట్లాడుతూ.. 3X, 4X మోడళ్ల విడుదలకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. 2013 నుంచి అల్ మన్నాయ్ ప్లస్ ఈవెంట్స్ నిర్వహిస్తున్న క్యూఐబీఎస్‌లో ఆరు ఖతారీ బోట్ తయారీదారులతో సహా మొత్తం 36 కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. హాలుల్ బోట్స్ ఛైర్మన్ అహ్మద్ మొహమ్మద్ హమద్ అల్-హిత్మీ మాట్లాడుతూ.. తమ కంపెనీకి చెందిన 10 కొత్త అత్యాధునిక పడవలు ఖతార్‌లో తయారు చేయబడ్డాయని, అవి ఈ ప్రదర్శనలో సందర్శనకు పెట్టామని వివరించారు. దోహా క్రాఫ్ట్ ఈ ఈవెంట్‌లో రెండు కొత్త బోట్‌లు 44’, 38.8’ మోడల్స్ ను విడుదల చేసింది. QIBS 2021ను కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ ఖాసిమ్ అల్-అబ్దుల్లా అల్-థానీ మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







