దుబాయ్‌లో తెలుగు అసోసియేషన్‌ ప్రారంభం

- November 21, 2021 , by Maagulf
దుబాయ్‌లో తెలుగు అసోసియేషన్‌ ప్రారంభం

దుబాయ్: తెలుగు వారికోసం కమ్యూనిటీ  డెవలప్ మెంట్ - దుబాయ్ ప్రభుత్వ ఆమోదిత మొదటి తెలుగు అసోసియేషన్ ప్రారంభం.దుబాయ్ లో మొట్ట మొదటి సారిగా కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటి దుబాయ్ వారి అనుమతి తో తెలుగు అసోసియేషన్ లాభాపేక్ష లేని సంస్థ ప్రారంభం అయ్యింది.దీనితో యూఏఈలో సుమారుగా 5 లక్షల మంది తెలుగు వారి చిరకాల వాంఛ తీరింది.

యూఏఈలో ఉభయ రాష్ట్రాల తెలుగు వారు వివిధ రంగాలలో రాణిస్తున్నారు అయితే ముఖ్యంగా సింహభాగంలో కార్మికులు ఉన్నారు. వారందరికీ మీ వెనుక మేమున్నామని భరోసా కల్పించడానికి అలాగే ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాల తో కలిసి పని చేయటానికి ఆయా ప్రాంతాల తెలుగు వారు వ్యవస్తపాక బృందాలు గా యేర్పడి యెన్నో వ్యయ ప్రయాసలకి ఓర్చి ఈ తెలుగు అసోసియేషన్ యేర్పర్చారు వ్యవస్థాపక బృందం. తెలుగు అసోసియేషన్ పాలక మండలి ఈ సందర్భంగా  ప్రమాణ స్వీకారం చేశారు.

తెలుగు అసోసియేషన్ పాలక మండలి:
దినేష్ కుమార్ ఉగ్గిన– ఛైర్మన్, మైసుద్దీన్ - వైస్ ఛైర్మన్ ,వివేకానంద– జనరల్ సెక్రెటరీ,  మురళీ కృష్ణ - ట్రెసరర్ , రవి కుమార్ కొమర్రాజు - డైరెక్టర్ కమ్యూనిటి సర్వీసెస్, సురేశ్ వక్కలగడ్డ - డైరెక్టర్ కల్చరల్ సర్వీసెస్, శ్రీనివాస్ యెండూరి - డైరెక్టర్ వెల్ఫేర్ AP, షేక్  షా వలీ ముల్లా - డైరెక్టర్ వెల్ఫేర్ తెలంగాణ,సుదర్శన్ కటారు - డైరెక్టర్ ఇంటర్నేషనల్ రేలేషన్స్,రాజీవ్ చింతకాయల్ - డైరెక్టర్ స్పొర్ట్స్,రాజ శేఖర్ గుజ్జు - డైరెక్టర్ మార్కెటింగ్,ప్రకాష్ ఇవటూరి - డైరెక్టర్ మీడియా.సురేంద్రనాథ్ ధేనుకుల సభ్యుడు, శ్రీధర్ దామెర్ల మేనేజర్ మరియు న్యాయ ప్రతినిధి.

ఈ సందర్భంగా రాశేద్ సైఫ్ అల్ఫాలాసీ తెలుగు అసోసియేషన్ లోగో ను,వెబ్సైట్ ను  ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, అధికారులు, సినీ రాజకీయ ప్రముఖులు తమ  శుభాశీస్సులను, సందేశాలను పంపారు.ఖాలిద్ అబ్దుల్లా మహమ్మద్ సాలెహ్ అల్అవధి  తమ శుభాకాంక్షలను తెలియచేసారు.

తెలుగు అసోసియేషన్ పాలక మండలి సభ్యులు దినేష్ ఉగ్గిన, సుదర్శన కటారు,సురేశ్ వక్కలగడ్డ మరియు వివేకానంద బలుసా మాట్లాడుతూ,  సేవ- సంస్కృతి -సమైక్యత అనే నినాదం తో తమ సంస్థ ముందుకు వెళుతుందని, ఉభయ రాష్ట్రాల విశ్వవిద్యాలయాల సహకారంతో కార్మికులకు సాంకేతిక విద్యా యందు శిక్షణ మరియు ప్రోత్సాహం అందించే ప్రయత్నాలు చేస్తున్నామని, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తో కార్మికులకు ప్రమాద జీవిత భీమా సౌకర్యం, అవసరం అయిన వారికి న్యాయ సలహా సహకారాలు వంటి వాటిని అందించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.అదేవిధంగా తమ సంస్థ యొక్క కార్యాచరణను సభ సదుల హర్షాతిరేకల మధ్య వివరించారు.ఈ నూతన తెలుగు అసోసియేషన్ కు మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com