ఒమన్ 51 నేషనల్ డే ఉత్సవాల్లో భాగంగా మస్కట్ గవ్నర్ విందు

- November 22, 2021 , by Maagulf
ఒమన్ 51 నేషనల్ డే ఉత్సవాల్లో భాగంగా మస్కట్ గవ్నర్ విందు

మస్కట్:  ఒమన్  51 వ నేషనల్ డే ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మస్కట్ గవర్నర్ సయ్యద్ హిలాల్ అల్ బుసైదీ మంత్రులకు, అధికారులు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. మస్కట్ లోని ఇంటర్ కాంటినెంటల్ హోటల్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మస్కట్ గవర్నర్ సయ్యద్ హిలాల్ అల్ బుసైదీ మాట్లాడారు. అందరికీ 51 వ నేషనల్ డే శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఒమన్ ప్రజలు సుఖ శాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఒమన్ రాజు సుల్తాన్ హైతం బిన్ తారిక్ కలకాలం ఆరోగ్యంగా ఉండాలని...ఆయన పాలనలో దేశం మరింత అభివృద్ధి చెందాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ విందు కార్యక్రమంలో పలువురు మంత్రులు, గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్  (జీసీసీ) మెంబర్లు, స్టేట్ కౌన్సిల్, షురా కౌన్సిల్ సభ్యులు,  సెక్రటరీలు, సీనియర్ మిలిటరీ కమాండర్లు, మస్కట్ లోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com