‘గమనం’ విడుదల తేదీ ఖరారు!
- November 22, 2021
హైదరాబాద్: శ్రియా సరన్, నిత్యామీనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గమనం’. ఈ మూవీ ద్వారా సుజనారావు దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయాలని తొలుత నిర్మాతలు రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్. ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్ 10వ తేదీన కేవలం తెలుగు వర్షన్ ను మాత్రమే విడుదల చేయబోతున్నారు. మూడు భిన్న కథలను దర్శకురాలు సుజనారావు ఒకే సినిమాలో చెప్పే ప్రయత్నం చేశారు.
ఇందులో శ్రియా సరన్ ఓ కథలో అలరించనున్నారు. శివ కందుకూరి ప్రేమకథలో కనిపించనున్నారు. అనాథలు, స్లమ్ ఏరియా నేపథ్యంలో జరిగే కథలో ప్రియాంక జవాల్కర్ నటించారు. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందించగా, ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. జ్ఞానశేఖర్ వి.ఎస్. కెమెరామెన్‌గా వ్యవహరించారు. విశేషం ఏమంటే… నిత్యామీనన్ నటించిన ‘స్కైలాబ్’ డిసెంబర్ 4న విడుదల కాబోతుండగా, ఆమె నటించిన మరో చిత్రం ‘గమనం’ అదే నెల 10న విడుదల అవుతోంది. సో… నిత్యామీనన్ తన అభిమానులను బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఆకట్టుకోబోతోంది.
తాజా వార్తలు
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్‌లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్‌లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!







