హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అలసట లేని, నిరాటంకమైన ప్రయాణం

- November 22, 2021 , by Maagulf
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అలసట లేని, నిరాటంకమైన ప్రయాణం

హైదరాబాద్: మీరు మొదటిసారి ప్రయాణిస్తున్నారా? మీరు తరచుగా ప్రయాణాలు చేస్తారా? విమానాశ్రయంలో ప్రవేశించినప్పటి నుండి బోర్డింగ్ వరకు సులభంగా ప్రయాణించాలనుకుంటున్నారా? మీ తల్లిదండ్రులు లేదా పిల్లలకు విమానాశ్రయంలో సహాయం కావాలా? మీరు లేదా మీ తల్లిదండ్రులు ఒంటరిగా ప్రయాణిస్తున్నారా? మీరు మీ విమానాన్ని అందుకునే తొందరలో ఉన్నారా? ఇలాంటి అన్ని ఆందోళనలకూ పరిష్కారముంది. మీరు ఎలాంటి ఆటంకాలూ, ఒత్తిడి లేకుండా ప్రయాణించాలనుకుంటే, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణించేటప్పుడు, GMR ప్రైమ్ ఆతిథ్య సేవలను తీసుకోండి. 

విమాన సర్వీసు, మీరు ఏ తరగతిలో ప్రయాణిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా మీరు ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నప్పటి నుండి GMR ప్రైమ్ మీకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన సేవలను అందించి, మీ ప్రయాణాన్ని మధురమైన అనుభూతిగా మారుస్తుంది. మీ అవసరాలను తీర్చే  అద్భుతమైన సేవల శ్రేణితో, GMR ప్రైమ్ - కార్పొరేట్ కస్టమర్‌లు, విశ్రాంతి ప్రయాణీకులు, గ్రూపులు, సీనియర్ సిటిజన్‌లు మొదలైన వారికి తగిన ప్యాకేజీలను అందిస్తుంది. ఈ సేవలో ఎక్స్‌ప్రెస్ చెకిన్, ఫాస్ట్ ట్రాక్ సెక్యూరిటీ, లగేజీ విషయంలో సహాయం, సంరక్షణ, సురక్షితమైన ప్రయాణం మొదలైనవి ఉన్నాయి.మీరు విమానాశ్రయం నుంచి వేరే నగరాలకు వెళుతున్న ప్రయాణీకులైనా, ఇతర నగరాల నుంచి వస్తున్న ప్రయాణీకులైనా, మీరు టెర్మినల్‌కు చేరుకున్నప్పటి నుండి లేదా దిగినప్పటి నుంచి GMR ప్రైమ్ మీకు సంపూర్ణంగా సహాయపడుతుంది. 

GMR ప్రైమ్ సర్వీస్ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకుల రాకపోకలు మరియు ట్రాన్సిట్ ప్రయాణంలో సహాయపడుతుంది. ప్రయాణీకుల సదుపాయం కోసం GMR ప్రైమ్‌ సర్వీసులో అనేక ప్యాకేజీలున్నాయి. GMR ప్రైమ్ సర్వీస్ సిబ్బంది ప్రయాణీకుల ప్రతి అవసరాన్ని అర్థం చేసుకునేలా ప్రత్యేక శిక్షణ పొందారు. 

జీఎంఆర్ ప్రైమ్ సేవలలో ఈ క్రిందివి కూడా ఉన్నాయి...

ఎక్స్‌ప్రెస్ చెకిన్ 
వ్యక్తిగత ప్యాసింజర్ అసిస్టెన్స్ సర్వీస్
పోర్టర్ సర్వీస్
లాంజ్ సదుపాయం
ఫాస్ట్ ట్రాక్ సెక్యూరిటీ క్లియరెన్స్

మీరు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నప్పుడు జీఎంఆర్ ప్రైమ్ యొక్క అనుభవజ్ఞులైన సిబ్బంది మీకు అవసరమైన సహాయం చేస్తారు. విలాసవంతమైన లాంజ్ మీ అలసిపోయిన మనస్సు, శరీరాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. లాంజ్‌లో మీరు కాంప్లిమెంటరీ సౌకర్యాలను అందుకోవచ్చు.

మీరు ట్రాన్సిట్ ప్రయాణీకులైతే, GMR ప్రైమ్ మీ తదుపరి గమ్యస్థానానికి నిరాటంకమైన బోర్డింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

కాబట్టి ఈసారి మీరు ఏదైనా ప్రయాణం ప్లాన్ చేసేటప్పుడు, ప్రైమ్ సర్వీస్‌లను బుక్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరింత సమాచారం కోసం https://gmrprime.hyderabad.aero/departure-packages ను చూడండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com