బిగ్ బాస్ హోస్ట్ గా శృతి హాసన్..?తండ్రిలా కూతురు అలరించగలదా?
- November 23, 2021
యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. యూరప్ లో విక్రమ్ షూటింగ్ కోసం వెళ్లిన ఆయనకు కరోనా సోకడంతో షూటింగ్ నిలిపివేశారు.
ప్రస్తుతం కమల్ హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇకపోతే కమల్ కొన్నిరోజులు రాకపోతే ఆయన నిర్వహిస్తున్న బిగ్ బాస్ పరిస్థితి ఏంటీ ..? అనేది ప్రస్తుతం తమిళీయులను తొలుస్తున్న ప్రశ్న.. అయితే దీనికి ఆన్సర్ దొరికేసిందని తెలుస్తోంది. కమల్ వచ్చేంత వరకు ఆయన స్థానాన్ని ఆమె కూతురు శృతి హాసన్ భర్తీ చేయనున్నదట.
తమిళ్ బిగ్ బాస్ షో కి శృతి హాసన్ హోస్ట్ గా రానున్నట్లు తెలుస్తోంది. కమల్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సింగర్, నటి, ర్యాపర్.. ఇప్పుడు ఈ షో తో హోస్ట్ గా కూడా మారబోతుంది. శృతి హాసన్‌ను హోస్ట్‌గా పెడితే ఈ షో మరింత ఆసక్తిగా మారుతుందనే ఉద్దేశంతో బిగ్ బాస్ నిర్వాహకులు కూడా భావించడంతో వెంటనే శృతిని సంప్రదించారట.. మరి ఈ విషయంలో శృతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్‌లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్‌కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్‌లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







