యూఏఈ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా కొత్త నంబర్ ప్లేట్లు
- November 24, 2021
అబుదాబి: యూఏఈ 50 వ జాతీయ దినోత్సవం సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఇక్కడి ప్రభుత్వం ఘనంగా జరుపనుంది. డిసెంబర్ 2 నాడు 50 వ నేషనల్ డే ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడి రవాణా, ట్రాఫిక్ పోలీసు అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా కొనబోయే వాహనాలకు యూఏఈ 50 న నేషనల్ డే గుర్తుగా కొత్త నంబర్ ప్లేట్లను అమర్చనున్నట్లు అబుదాబి పోలీస్ శాఖ జనరల్ కమాండెంట్ తెలిపారు. నంబర్ ప్లేట్ పై ప్రత్యేకంగా 50 అనే నంబర్ ఉంటుంది. నేటి నుంచే కొనే వాహనాలకు కొత్త నంబర్ ప్లేట్లు ఇవ్వనున్నారు. కొత్తగా రానున్న ప్లేట్లకు కోడ్ తో పాటు 50 అబుదాబి అనే పేరు ప్రత్యేకంగా కనిపించనుంది. ఈ నంబర్ ప్లేట్లను చాలా బాగున్నాయని దేశ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







