వైఫైకి 100 రెట్లు వేగంతో వైఫై
- March 22, 2016
వైఫై టెక్నాలజీకి 100 రెట్లు వేగంతో పనిచేసే లైఫై నెట్వర్క్ అతి త్వరలోనే దుబాయ్‌లో అందుబాటులోకి రానుంది. అది కూడా వైఫైతో పోల్చితే తక్కువ ధరకే లభ్యం కానుంది. యూఏఈకి చెందిన టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ డు మరియు యూఏఈకి చెందిన ష్ట్రబ్రాండ్ జీరో1, సక్సెస్‌ఫుల్‌గా ఈ విధానాన్ని డెమోన్స్ట్రేట్ చేశామని వెల్లడించాయి. లైట్ ఫెడెలిటీ (లైఫై) టెక్నాలజీ దుబాయ్‌లో సంచలనాలకు సిద్ధం అవుతోందని వారు వెల్లడించారు. లైఫై అంటే వైర్లెస్ ఆప్టికల్ నెట్వర్క్ టెక్నాలజీతో పనిచేస్తుంది. లైట్ ఎమిటింగ్ డయోడ్స్ (ఎల్ఇడి) టెక్నాలజీని లైఫై ఉపయోగించుకుంటుంది. సెకెనుకి 224 జిబి డాటా ట్రాన్స్ఫర్ ఈ లైఫై టెక్నాలజీతో సాధ్యమవుతుంది. 2021 నాటికి లైఫై మార్కెట్ 80 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని డు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సలీమ్ అల్బ్లూషి చెప్పారు. జీరో1తో కలిసి డు సంస్థ లైఫై ఎనేబుల్డ్ సొల్యూషన్స్‌ని డెవలప్ చేస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







