భారత్ నుంచి ఆఫ్ఘన్ వెళ్లే వాహనాలకు అనుమతి...
- November 25, 2021
భారత్ కు పాక్ గుడ్‌న్యూస్ చెప్పింది.భారత్ నుంచి ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లే వాహనాలకు అనుమతిస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.మానవతా దృక్పదంతోనే వాహనాలకు అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించింది.ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడ పరిస్థితులు దారుణంగా మారిపోయాయి.ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సరైనా ఆహారం అందక అలమటిస్తున్నారు.ఆఫ్ఘనిస్తాన్‌కు సాయం చేసేందుకు అనేక దేశాలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, భారత్ కూడా ముందుకు వచ్చి 50వేల మెట్రిక్ టన్నుల గోధుమలను అందించేందుకు సిద్ధమైంది.అయితే, ఈ గోధుమలను భారత్ నుంచి పాక్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్‌కు చేరవేయాల్సి ఉంది.గోధుమలతో పాటుగా మెడిసిన్‌ను కూడా సరఫరా చేసుందుకు భారత్ ముందుకు వచ్చింది.మానవతా దృక్పథంతో అనుమతులు ఇస్తున్నామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈరోజు తెలియజేశారు.దీంతో సుమారు 500 లారీలు భారత్ నుంచి ఆఫ్ఘన్‌కు వెళ్లేందుకు మార్గం సుగమం అయింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







