సిగ్నల్ జంప్ ప్రమాదాలపై వీడియోలతో వార్నింగ్ ఇస్తున్న అబుధాబి పోలీసులు
- November 27, 2021
అబుధాబి: సిగ్నల్ జంప్ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అబుదాది పోలీసులు (ADP) చెప్పారు. వాహనదారులు దయచేసి సిగ్నల్ జంప్స్ చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. వాహనాదారులకు దీనిపై అవగాహన కల్పించేందుకు సిగ్నల్ జంప్ చేసి ట్రాఫిక్ వాయిలేషన్స్ కు పాల్పడిన కొందరికి జరిగిన ప్రమాదాల వీడియోలను ప్రదర్శించారు. అబుదాబి పోలీసుల ఫాలో-అప్, కంట్రోల్ సెంటర్ సహకారంతో దర్బ్ అల్ సలామా అనే సంస్థ ద్వారా వీడియోలను జనాల్లోకి విడుదల చేశారు. డ్రైవింగ్ చేసే సమయంలో ఫోన్ మాట్లాడితే భయంకరమైన యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ డ్రైవింగ్ కు 800 దిర్హామ్ లు ఫైన్, 4 ట్రాఫిక్ పాయింట్లు… సిగ్నల్ జంప్ చేస్తే 1000 దిర్హామ్ లు ఫైన్, 12 ట్రాఫిక్ పాయింట్లతో పాటు గరిష్టంగా మూడు నెలల పాటు వెహికిల్ ని జప్తు చేస్తామని వీడియోలో ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఫైన్లు, ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







