మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... ప్రపంచ వ్యాప్తంగా 259.61 మిలియన్ల మందికి వైరస్
- November 27, 2021
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వైరస్ ఎఫెక్ట్ తగ్గిందని అంతా భావిస్తున్నప్పటికీ చాపకింద నీరులా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది. తాజాగా సౌత్ ఆఫ్రికాలో పుట్టిన కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగానూ మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం వరకు కేసులు తక్కువగా నమోదైనప్పటికీ...మళ్లీ వాటి సంఖ్య వేగంగా పెరగుతుండటం ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 259.61 మిలియన్లకు చేరింది.ఇది అధికారిక లెక్క మాత్రమే. అనధికారికంగా ఇంత కన్నా ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. ఇక మహమ్మరి కారణంగా 54,36, 733 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019 డిసెంబర్ లో చైనా లో తొలి కరోనా కేసు నమోదైంది. ఆరు నెలల కాలంలోనే ఇది ప్రపంచ దేశాలను చుట్టుముట్టింది. మొత్తం 210 దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఐతే ఇప్పటికీ కరోనా ప్రమాదం పొంచి ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. ప్రజలంతా మాస్క్ ధరించి, శానిటైజేషన్, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తోంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







