కొత్త వీసాల జారీ ప్రక్రియ ఆన్ లైన్ లో...మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి
- November 27, 2021
కువైట్:వీసాల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేయనున్నట్లు కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ (పీఏఎమ్ )తెలిపింది. వర్క్ పర్మిట్ కు సంబంధించిన వీసాలను త్వరలోనే ఆన్ లైన్ లో జారీ చేస్తామని ప్రకటించింది. వర్క్ పర్మిట్ వీసాలు తీసుకోవటానికి జనాలు ఆఫీసుల చుట్టు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ సమస్యపై దృష్టి పెట్టిన (పీఏఎమ్) అధికారులు ఆన్ లైన్ లో వీసాల జారీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఇది అమల్లోకి రావచ్చని అధికారులు తెలిపారు. వర్క్ వీసాలను ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి బదిలీ చేయటం, ఫ్యామిలీ వీసా నుంచి కంపెనీ వీసా మార్చుకోవటం, స్టూడెంట్ వీసాను వర్క్ పర్మిట్ వీసా మార్చుకునేందుకు కూడా ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే చాలా మంది ప్రవాసులకు మేలు జరగనుంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







