కోవిడ్ కొత్త వేరియంట్‌పై అత్యంత అప్రమత్తం

- November 27, 2021 , by Maagulf
కోవిడ్ కొత్త వేరియంట్‌పై అత్యంత అప్రమత్తం

కువైట్: కోవిడ్ 19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయమై అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కువైట్ ఆయా విభాగాల్ని హెచ్చరించింది. ఈ మేరకు అత్యవసర హెల్త్ మీటింగ్ తాజాగా జరిగింది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ షేక్ డాక్టర్ బాసిల్ అల్ సబా నేతృత్వంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. సుప్రీం కమిటీ ఫర్ కరోనా ఎమర్జన్సీస్, అత్యవసరంగా రేపు మరో సమావేశం నిర్వహించనుంది. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలాగే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ షేక్ హమాద్ అల్ అలి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కువైట్ వచ్చే ప్రయాణీకులంతా తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని అధికారులు స్పష్టం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com