18 ఏళ్ళు పైబడిన విదేశీ యాత్రీకులకు ఉమ్రా అనుమతులు
- November 27, 2021మక్కా: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, గరిష్ట వయసు పరిమితిని ఉమ్రా విషయమై తొలగించింది. విదేశాల నుంచి వచ్చే యాత్రీకులకు వయసు పరిమితిని తొలగిస్తూ, 18 ఏళ్ళు పైబడిన ఉమ్రా యాత్రీకులందరికీ అనుమతులు మంజూరు చేయనుంది. ఉమ్రా ప్రార్థనలు చేసేందుకు అలాగే గ్రాండ్ మసీదు అలాగే అల్ రవదాహ్ షరీఫ్ - ప్రొఫెట్ మసీదు వద్ద ప్రార్థనలు చేసేందుకు అనుమతులు జారీ చేస్తారు. అయితే, 18 ఏళ్ళ లోపు విదేశీ యాత్రీకులకు మాత్రం అనుమతి లేదు. దేశీయ యాత్రీకులకు మాత్రం 12 ఏళ్ళ పైబడితే అనుమతిస్తారు. సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనను తొలగించినప్పటికీ, ఫేస్ మాస్కులు ధరించాలి. కాగా, ఇండోనేసియా, పాకిస్తాన్, ఇండియా మరియు ఈజిప్టు దేశాలపై డిసెంబర్ 1 నుంచి ప్రయాణ నిషేధాన్ని తొలగిస్తున్నారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..