ఏపీకి రెయిన్ అలెర్ట్...అక్కడ ఆరెంజ్ అలెర్ట్ జారీ
- November 28, 2021
ఏపీని ఇప్పట్లో వానలు వదలేలా లేవు. మరోసారి ఏపీకి వర్షగండం పొంచి ఉంది. గత నెల కాలంగా వరసగా వస్తున్న వాయుగుండాలు, అల్పపీడనాల వల్ల పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లాయి.
ఎన్నడూ లేని విధంగా రాయలసీమను వరదలు వణికించాయి. తాజాగా మరోసారి ఏపీకి వర్షం ముప్పు ఉందని ఐఎండీ హెచ్చిరిస్తోంది. రేపు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది. మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రంత తెలిపింది.
తాజాగా ప్రకాశం, నెల్లూర్, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేశారు. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని తెలపింది. క్రిష్ణా, గుంటూర్, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల సూచనల మేరకు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. తిరుపతి పట్టణంలో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో కలెక్టర్లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కంట్రోల్ రూం లు ఏర్పాటు చేసి, వర్ష ప్రభావాన్ని సమీక్షించనున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







