ఖతార్ లో 17 ట్రావెల్, ఎయిర్ కార్గొ ఏజెన్సీలు సీజ్..!!
- June 25, 2026
దోహా: ఖతార్ లో నిబంధనలు పాటించని 17 ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలను మూసివేశారు. ఎయిర్ కార్గొపై పర్యవేక్షణను బలోపేతం చేయడం, ఆమోదించబడిన చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూడటం లక్ష్యంగా కొనసాగుతున్న తనిఖీ ప్రచారాలలో భాగంగా, ఆయా ఏజెన్సీలను మూసివేస్తున్నట్లు ఖతార్ పౌర విమానయాన అథారిటీ (QCAA) ప్రకటించింది. తాజా తనిఖీల సందర్భంగా నిబంధనలు పాటించని ఏజెన్సీలను గుర్తించి, చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
ఈ రంగంలో పనిచేస్తున్న అన్ని సంస్థలు కచ్చితంగా సంబంధిత చట్టాలను, వాటిల్లోని నిబంధనలను పాటించాలని సూచించింది. ట్రావెల్ మరియు ఎయిర్ కార్గో ఏజెన్సీలు ఏవైనా కార్యకలాపాలు చేపట్టే ముందు అవసరమైన లైసెన్సులను పొందాలని అథారిటీ స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







