రాయల్ ఒపెరా హౌస్ టిక్కెట్ల అమ్మకం ప్రారంభం

- November 30, 2021 , by Maagulf
రాయల్ ఒపెరా హౌస్ టిక్కెట్ల అమ్మకం ప్రారంభం

మస్కట్: 2022 సీజన్ రాయల్ ఒపెరా హౌస్ మస్కట్ కోసం టిక్కెట్ల అమ్మకాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదలయ్యింది. రాయల్ ఒపెరా హౌస్ మస్కట్ తన పదవ యానివర్సరీ జరుపుకుంటోంది. జనవరి నుంచి మే వరకు ఈ వేడుక జరుగుతుంది. 25 ప్రొడక్షన్లు 35 షోలు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణలు. రెండు బ్యాలెట్ షోలు, ఒపెరా మరియు ఒపెరెట్టా నిర్వహిస్తారు. అరబ్ తారలతో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ వేడుకని నిర్వహించనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com