ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ జీతం ఎంతో తెలుసా?

- November 30, 2021 , by Maagulf
ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ జీతం ఎంతో తెలుసా?

పరాగ్ అగర్వాల్.. ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా ఈ పేరు మార్మోగిపోతోంది. సోషల్ మీడియా, బయట ఎవరిని కదిపినా.. పరాగ్ అగర్వాల్ గురించే చర్చిస్తున్నారు. సోమవారం (నవంబర్ 29) సీఈఓగా అగర్వాల్‌ను ట్విటర్‌ కంపెనీ నియమించడమే అందుకు కారణం. సీఈఓగా పరాగ్ నియామకం అవ్వడంతో.. అరడజనుకు పైగా గ్లోబల్ టెక్ కంపెనీలు భారతీయ-అమెరికన్ల నేతృత్వంలో ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలోఆల్టో నెట్‌వర్క్స్‌ లాంటి సంస్థలను భారతీయులు అద్భుతంగా నడుపుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో పరాగ్‌ చేరారు.

ట్విట్టర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్ నియామకం అయ్యాక ఆయన వివరాల గురించి అందరూ గూగుల్ చేస్తున్నారు. ముఖ్యంగా పరాగ్ వయసు, విద్యాబ్యాసం, ఫామిలీ బ్యాక్‌గ్రౌండ్, సాలరీ వంటి విషయాల కోసం చాలా మంది శోధిస్తున్నారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. 38 ఏళ్ల పరాగ్.. ఐఐటీ బాంబే, స్టాన్‌‌ఫోర్డ్‌ విశ్వ‌వి‌ద్యా‌లయం పూర్వ విద్యార్థి. పదేళ్ల క్రితం ట్విట్ట‌ర్‌లో యాడ్స్‌ ఇంజి‌నీ‌ర్‌గా చేరారు. అంచె‌లం‌చె‌లుగా ఎదు‌గుతూ 2017లో ట్విటర్‌ టెక్నా‌లజీ అధి‌ప‌తిగా పదో‌న్నతి పొందారు. ప్రస్తుతం సీఈ‌వోగా ఎన్ని‌క‌య్యారు. పరాగ్‌ అగర్వాల్‌ గతంలో మైక్రో‌సాఫ్ట్‌, యాహూ వంటి సంస్థ‌ల్లోనూ పని‌చే‌శారు. 

పరాగ్ అగర్వాల్ తండ్రి అనుమంత్రిత్వ శాఖలో పనిచేశారు. అమ్మ రిటైర్డ్ టీచర్. పరాగ్  భార్య పేరు వినీత అగర్వాల్. వైద్య రంగానికి చెందిన ఓ కంపెనీలో ఆమె భాగస్వామ్యులు. పరాగ్-వినీతలకు మూడేళ్ల బాబు ఉన్నాడు. ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్, పరాగ్ క్లాస్ మేట్స్ కూడా అట. ఇక పరాగ్ వార్షిక వేతనం 1 మిలియన్ డాలర్లు అని సమాచారం తెలుస్తోంది. భారత కరెన్సీలో దాదాపుగా 7.50 కోట్లు. వేతనంతో పాటు 12.5 మిలియన్ డాలర్ల స్టాక్ యూనిట్లు కూడా అందుకోనున్నారు. వీటితో పాటు ట్విట్టర్ ఉద్యోగులు పొందే అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com