బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్టు ప్రారంభంపై రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటన

- November 30, 2021 , by Maagulf
బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్టు ప్రారంభంపై రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటన

మనామా:బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్టు (మొదటి ఫేజ్) విషయమై  ప్రజా రవాణా విభాగంలో స్థానిక, అంతర్జాతీయ సంస్థల అర్హత టెండరుని రవాణా మరియు టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టుని రూపొందించారు. బహ్రెయిన్ విజన్ 2030లో భాగంగా ఈ మెట్రో ప్రాజెక్టుని చేపడుతున్నారు. మెట్రో విభాగంలో అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. ప్రైవేటు విభాగంతో కలిసి పిపిపి విధానంలో ఈ ప్రాజెక్టుని చేపడతారు.మొదటి ఫేజ్ రెండు లైన్లలో మొత్తం 29 కిలోమీటర్ల మేర 20 స్టేషన్లతో నిర్మిస్తారు. ముహరాక్, మనామా, డిప్లమాటిక్ ఏరియా, జుఫ్ఫైర్, సీఫ్ డిస్ట్రిక్ట్, తుబ్లి, అధారి మరియు ఇసా టౌన్‌లను కలుపుతుంది మెట్రో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com