డిసెంబర్ 2న నార్త్ షర్కియాలో క్లీన్-అప్ క్యాంపెయిన్
- December 01, 2021
ఒమన్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహకారంతో హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ టూరిజం ప్లేస్ లలో పరిశుభ్రంగా ఉంచడం.. దాని ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు డిసెంబర్ 2న ఉత్తర షర్కియా గవర్నరేట్‌లో స్వచ్ఛంద క్లీన్-అప్ క్యాంపెయిన్ ను ప్రారంభించనుంది. 50 మంది వాలంటీర్లతో రెండు రోజుల పాటు ఇది కొనసాగుతుందని నార్త్ షర్కియాలోని టూరిజం ప్రమోషన్ డైరెక్టర్ జనరల్ హమద్ సైఫ్ అల్ బదావి చెప్పారు. వాలంటీర్ల నుంచి సూచనలను స్వీకరించడానికి డిసెంబర్ 2న సమావేశమవుతామని, ఈ ప్రచారంలో పాల్గొన్నందుకు వారికి బహుమతులు అందిస్తామన్నారు. డిసెంబర్ 3న ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు క్లీనింగ్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు బదావి తెలిపారు. షర్కియా సాండ్స్‌లోని షాగత్ అల్ రకా, షగత్ అల్ యారిసియా, షగత్ అల్ జవ్ఫా, షగత్ అల్ అమైయా, షగత్ అల్ సఫా, షాగత్ షబక్‌లోని టూరిజం శిబిరాల్లో క్లీన్-అప్ క్యాంపెయిన్ నిర్వహించబడుతుందన్నారు. పర్యాటక ప్రదేశాలలో పరిశుభ్రత ప్రాముఖ్యతపై అవగాహన పెంచడంతోపాటు, మరింత మంది పర్యాటకులను ఆకర్షించడానికి ఈ క్యాంపెయిన్ లక్ష్యమన్నారు. దీంతో పాటు ఉత్తర షర్కియాలోని బనీ ఖలీద్, దిమా వా అల్ తైన్, ఇబ్రా, ముదాబి వంటి విలాయత్‌లలో పర్యాటక ప్రదేశాలను సంరక్షించడంపై అవగాహన కల్పిస్తామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి







