ఫోన్ చేస్తారు.. డబ్బు కాజేస్తారు
- December 02, 2021
హైదరాబాద్: ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో నకిలీ ఎస్బీఐ బ్యాంకు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారని... ఇది దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసమని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. ఏడాదిలోనే దేశ వ్యాప్తంగా అమాయకులకు 33వేలు కాల్స్ చేసి.. కోట్ల రూపాయలు కాజేశారన్నారు. ఈ ముఠాపై దేశ వ్యాప్తంగా 209 కేసులున్నాయన్నారు. ఎస్బీఐ ఎజెంట్లు నుంచి ఖాతాదారుల వివరాలు తీసుకున్న ఫర్మన్ హుసేన్ ప్రధాన నిందితడు... స్పూఫింగ్ అప్లికేషన్ తయారు చేసి నకిలీ కార్డులు తయారు చేస్తున్నారని స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. ఈ అప్లికేషన్‌ను విదేశాల్లో కూడా నిందితులు వాడుతున్నారన్నారు. +18601801290 అనే నంబరు నుంచి ఫోన్ చేస్తారని.. బాధితుల నుంచి కార్డుల వివరాలు సేకరించి డబ్బు కాజేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో మొత్తం 14మందిని అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి 30 సెల్ఫోన్లు, 3 లాప్‌టాప్‌లు, ఒక కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







