యూఏఈ గోల్డెన్ జూబ్లీ రిసెప్షన్.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరు
- December 04, 2021
న్యూఢిల్లీ: ఇండియాలోని యూఏఈ ఎంబసీలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు. ఇండియాలో యూఏఈ అంబాసిడర్ డాక్టర్ అహ్మద్ అల్ బన్నా నిర్వహించిన రిసెప్షన్‌కు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జైశంకర్ యూఏఈ ప్రజలకు ఇండిపెండెంట్ గ్రీటింగ్స్ తెలిపారు. అలాగే యూఏఈ ఎక్స్ టెర్నర్, ఇంటర్నేషనల్ సహకార మినిస్టర్ H.H. షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు అభినందనలు చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్నసమగ్ర వ్యూహాత్మక రిలేషన్ కొత్త శిఖరాలకు చేరుతుందని నమ్మకంగా ఉందని సోషల్ మీడియాలో జైశంకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా అబుదాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మాటలను డాక్టర్ అల్ బన్నా గుర్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 2016లో షేక్ మొహమ్మద్ తొలిసారిగా ఇండియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ‘యూఏఈ డెవలప్ మెంట్ లో ఇండియన్స్ కూడా భాగం’ అని అన్నారు. ఎమిరాటీ గాయకుడు అబ్దుల్లా అల్ షమ్సీ తన పాటలతో రిసెప్షన్లో అందరినీ అలరించారు.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







