దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన కొత్త షెడ్యూల్ విడుదల
- December 06, 2021
దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటనకు సంబంధించి దక్షిణాఫ్రికా బోర్డు తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. వాస్తవానికి డిసెంబర్ 17 నుంచి తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పర్యటన షెడ్యూల్‌ను దక్షిణాఫ్రికా బోర్డు సవరించింది. దీంతో సవరించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం అవుతుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.
టీమిండియా పర్యటన షెడ్యూల్:
తొలి టెస్టు-వేదిక: సెంచూరియన్ (డిసెంబర్ 26 నుంచి 30 వరకు)
రెండో టెస్టు-వేదిక: జోహన్నెస్ బర్గ్ (జనవరి 3 నుంచి 7 వరకు)
మూడో టెస్టు-వేదిక: కేప్‌టౌన్ (జనవరి 11 నుంచి 15 వరకు)
తొలి వన్డే-వేదిక: పార్ల్ (జనవరి 19)
రెండో వన్డే-వేదిక: పార్ల్ (జనవరి 21)
మూడో వన్డే-వేదిక: కేప్‌టౌన్ (జనవరి 23)
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







