హెలికాప్టర్ ప్రమాదంపై లోక్‌సభలో రాజ్‌నాథ్
- December 09, 2021
న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాద ఘటనలో మరణించిన వారికి లోక్‌సభ సంతాపం తెలిపింది. సభ్యులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం హెలికాప్టర్ దుర్ఘటనపై రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేశారు.
ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారన్నారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించామన్నారు. బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు వెల్లింగ్టన్‌లో హెలికాప్టర్ ల్యాండ్ కావాల్సి ఉందని.. అయితే మధ్యాహ్నం 12.08 గంటలకు సుల్లూరు ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయన్నారు.
ఈ ప్రమాదంతో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన సతీమణి మృతి చెందారని రాజ్‌నాథ్ వెల్లడించారు. హెలికాప్టర్ కూలిపోవడాన్ని స్థానికులు గమనించారని, భారీ శబ్దం రావడంతో ఘటనా స్థలానికి స్థానికులు చేరుకున్నారన్నారు. గురువారం సాయంత్రానికి మృతదేహాలు ఢిల్లీకి చేరుతాయన్నారు. శుక్రవారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయన్నారు. హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ జరుగుతోందని, ఎయిర్‌మార్షల్ నేతృత్వంలో విచారణ కమిటీ నియమించినట్లు రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







