చిరంజీవి నిద్ర లేవగానే మా అమ్మ ఫోటో చూస్తారు:సావిత్రి కుమార్తె
- December 10, 2021
“మహానటి సావిత్రి 86వ జయంతి ఉత్సవాలు - సావిత్రి నటనా వైదుష్యం”పై ఐదు ఖండాలలోని తొమ్మిది దేశాలనుండి 80మంది రచయితలు, రచయిత్రులు మహానటి సావిత్రి నటించిన 80 చిత్రాలపై ప్రసంగాలు నాలుగవ రోజు దిగ్విజయంగా, ఉత్సాహవంతంగా వంశీ, శుభోదయం గ్రూప్ నిర్వహణలో కొనసాగాయి.
ఈ కార్యక్రమానికి వంశీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు స్వాగత వచనాలు పలకగా ఎంతో ఉత్సాహంగా రచయిత్రి లావణ్య బుద్ధవరపు మరియు రచయిత్రి కవిత బేతి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
ఈనాటి ముఖ్య అతిధి రచయిత, వ్యక్త, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం ప్రసంగిస్తూ సావిత్రి నటనా కౌశలన్నీ, సహజంగా నటించే తీరుని, పాత్రలలో లీనమైపోయి ప్రేక్షకుల మనసులలో సుస్థిర స్తానం ఏర్పరుచుకున్నారనే విషయాన్ని గుర్తుచేశారు.
మాహానాటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి అందరి ప్రసంగాలు వింటూ, సావిత్రి తీపి కబుర్లు ఆనందంగా పంచుకున్నారు. “ఒకసారి హైదరాబాదులో చిరంజీవి ని కలవడానికి వాళ్ళింటికి వెళ్లాను. అప్పుడు ఆయన కాలికి దెబ్బ తగిలి కట్టు కట్టుకుని వాకింగ్ స్టిక్ సాయంతో నడుస్తున్నారు. నన్ను చూడగానే ఆప్యాయంగా పలకరించి, ‘నేను పొద్దున్నే లేవగానే ఏమి చేస్తానో తెలుసా. నువ్వు చెబితే నమ్మవు చూపిస్తాను’, అని కుంటుతూనే పైకి వెళ్లి అమ్మ ఫోటో తీసుకొని వచ్చి నాకు చూపించి, ‘నిద్ర లేవగానే అమ్మ ఫోటో చూడటం నాకు అలవాటు’ అని అన్నారు, అమ్మ అంటే ఆయనకి అంత ఆప్యాయత” అని చెప్పారు.
అద్భుతంగా సాగుతున్న ఈ కార్యక్రమానికి చైర్మన్ శుభోదయం గ్రూప్, డాక్టర్ కలపటపు లక్ష్మీప్రసాద్ తమ సహకారం అందించారు, మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.
శుభోదయం గ్రూపు ప్రసన్న లక్ష్మి తమ వందన వచనాలు తెలుపగా, శైలజా సుంకరపల్లి మేనేజింగ్ ట్రస్టీ, వంశీ నిర్వహణ లో జరిగిన ఈ కార్యక్రమంలో సావిత్రి ఈ సినిమాల గురించి రచయిత్రులు “సావిత్రి నటనా వైదుష్యం”పై తన ప్రసంగాలను వినిపించారు.
గోరింటాకు - కామేశ్వరి చెంగల్వల
ప్రాణమిత్రులు - నిష్టల కృష్ణవేణి, ఛత్తీస్ ఘడ్
ప్రేమ తరంగాలు - నాగజ్యోతి
మనుషులు మమతలు -ముచ్చెర్ల రజని శకుంతల
పుట్టినిల్లు మెట్టినిల్లు - స్వాతి బొలిశెట్టి
భాగ్యదేవత - దీప్తి ఆకెళ్ళ
రూపవతి - ఇందిరా ప్రియదర్శిని
దీపావళి - రాజ్యశ్రీ పొత్తూరి
తోబుట్టువులు-చంద్రమౌళి రామకృష్ణ

తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







