ఒమిక్రాన్ ను డోంట్ కేర్ అంటున్న కువైటీలు...ప్రయాణాలకే మొగ్గు
- December 10, 2021
కువైట్: కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజలు క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్ కోసం ప్రయాణ ప్రణాళికలను వేస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సంతృప్తిగా ఉన్న ప్రజలు.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సిద్ధమవుతున్నారు. కొత్త వేరియంట్ పై ప్రజల్లో అవగాహన పెరగడంతో డైరెక్టరేట్-జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రయాణ పరిమితులను సడలించింది. ఫెడరేషన్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీసుల డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ మహమ్మద్ అల్-ముతైరీ మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల కోసం ప్రయాణ రిజర్వేషన్లు పెరిగాయన్నారు. లండన్, టర్కీ, రియాద్, జెద్దా, దుబాయ్‌లకు వెళ్లేందుకు కువైటీలు ఎక్కువగా ఇష్టపడతారని, ఆ రూట్లలోనే ఎక్కువగా రిజర్వేషన్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







