'చిన్నప్పుడు పాములతో ఆడుకునేవాళ్లం': విజయ చాముండేశ్వరి
- December 11, 2021
“వరుసగా ఐదవ రోజు దిగ్విజయంగా మహానటి సావిత్రి 86వ జయంతి ఉత్సవాలు - సావిత్రి నటనా వైదుష్యం”పై ఐదు ఖండాలలోని తొమ్మిది దేశాలనుండి 80మంది రచయితలు, రచయిత్రులు మహానటి సావిత్రి నటించిన 80 చిత్రాలపై ప్రసంగాలు నాలుగవ రోజు దిగ్విజయంగా వంశీ, శుభోదయం గ్రూప్ నిర్వహణలో కొనసాగాయి.
ఈ కార్యక్రమానికి వంశీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు స్వాగత వచనాలు పలకగా ఎంతో ఉత్సాహంగా రచయిత్రి దీప్తి ఆకెళ్ళ మరియు రచయిత్రి కవిత బేతి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
ఈనాటి ముఖ్య అతిధి ముఖ్య అతిధి ‘పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ’ పూర్వ వైస్ ఛాన్సలర్ డా. A మంజులత ప్రసంగిస్తూ “సావిత్రి అంటే నాకు ఇష్టం, సావిత్రి ఒక మహానటి ఆమె తెలుగువాళ్ళ జాతి సంపద’ అని అన్నారు.
మాహానాటి సావిత్రి కుమార్తె, విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ... “చిన్నారి పాపలు సినిమా చిత్రిస్తున్నప్పుడు రోజారమణి పరిచయమయ్యారు. అమ్మ స్నేహితురాలు ఇంట్లోనే ఆ సినిమా షూటింగ్ జరిగింది. ఆ షూటింగ్ కి మేము ఇద్దరమూ వెళ్ళాము. అందులో ఒక పాము కూడా ఉంది. ఆ పాములతను అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాడు. అప్పుడే మాకు పాముతో ఆడుకోవటం అలవాటయింది. ఆ చిత్రంలో రోజారమణి, శాంతికళ ‘మాది ఒకటే రక్తం’ అని చెప్పుకోవడానికి వేలుని గుచ్చుకొని రక్తం చూపించే సన్నివేశం ఉంది. అది చూసి నేను, రోజారమణి కూడా ‘మన ఇద్దరం మంచి స్నేహితులం కదా, చిన్న గాటు పెట్టుకొని రక్తం చూపించుకొని అక్కాచెల్లెళ్ళు అయిపోదామ’ని ప్రయత్నించి, గుచ్చుకుంటే నొప్పి పెడుతుందని తిలకం వేసుకుని అదే రక్తమని ఆడుకున్నాము” అని చిన్ననాటి కబుర్లు పంచుకున్నారు.
అద్భుతంగా సాగుతున్న ఈ కార్యక్రమానికి చైర్మన్ శుభోదయం గ్రూప్, డాక్టర్ కలపటపు లక్ష్మీప్రసాద్ తమ సహకారం అందించారు, మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.
శుభోదయం గ్రూపు ప్రసన్న లక్ష్మి తమ వందన వచనాలు తెలుపగా, శైలజా సుంకరపల్లి మేనేజింగ్ ట్రస్టీ, వంశీ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో సావిత్రి ఈ సినిమాల గురించి రచయిత్రులు “సావిత్రి నటనా వైదుష్యం”పై తన ప్రసంగాలను వినిపించారు
పెత్తందార్లు - లలిత వర్మ
అర్ధాంగి - రాధిక మంగిపూడి
చంద్రహారం - బాలాంత్రపు లావణ్య
చిన్నారి పాపలు - సాధన నరసింహాచార్యులు
కన్నతల్లి - డా.గురజాడ శోభా పేరిందేవి
రామరాజ్యం - డా.K.T. పద్మజ
బతుకు తెరువు – మణి కోపల్లె
నిర్దోషి - ఉగాది వసంత
ఆత్మబంధువు - డా.ఉమాదేవి బల్లూరి
కార్తవరాయణి కథ – వి.కె. దుర్గ



తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







