వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ కీలక నిర్ణయాలు
- December 11, 2021
తిరుపతి:కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. స్వామివారి దర్శనాల పెంపు తదితర విషయాలపై టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ పాలక మండలి సమావేశమయ్యింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తాం అని వైవి సుబ్బారెడ్డి అన్నారు.జనవరి 13 న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుంది.కోవిడ్ నిభందనలు సడలిస్తే…పండుగ తరువాత సర్వదర్శనం పెంపు ,ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడం ప్రారంభిస్తాం.11 మంది చిన్నపిల్లలుకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స నిర్వహించారు.చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులుకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం కల్పిస్తాం. 500 ఉదయాస్తమాన సేవా టిక్కేట్లు ప్రస్తుతం ఖాళీగా వున్న వాటిని భక్తులుకు కేటాయిస్తాం. బోర్డ్ సభ్యులు కూడా కోంత మంది విరాళాలు అందించేందుకు అంగీకరించారు అని తెలిపారు.
ఇక హనుమంతుడి జన్మస్థలమైనా అంజనాద్రి ప్రాంతాని అభివృద్ధి చేస్తాం.నాదనీరాజనం మండపం వద్ద శాశ్వత ప్రాతిపాదికన మండపాని నిర్మిస్తాం.భక్తులు సౌకర్యార్థం అన్నమయ్య నడకమార్గాని రోడ్డు మార్గంగా అభివృద్ధి పర్చడానికి నిర్ణయం తీసుకున్నం.హిందు దర్మప్రచారంలో భాగంగా ప్రతి జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నం.వర్షం కారణంగా అన్నమయ్య ప్రాజెక్ట్ వద్ద కోట్టుకుపోయిన ఆలయాలను తిరిగి పున:నిర్మిస్తాం.ఐటి విభాగాన్ని పటిష్టవంతంగా నిర్వహించేందుకు ఉద్యోగ నియామకాలు చేస్తాం. 2.6 కోట్ల రూపాయల వ్యయంతో నూతన పరకామణి మండపంలో యంత్రాలు కొనుగోలు చేసాం.శ్రీశైలం ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేస్తాం. తాళ్లపత్ర కందిరీగలను పరిరక్షించడానికి యస్వీ వేద విద్యాలయంలో మ్యాన్ స్ర్కిప్ట్ విభాగాని ఏర్పాటు చేస్తాం.
ఇక వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు ఉచితంగా దర్శనభాగ్యాం కల్పిస్తాం. భక్తులుకు శ్రీవేంకటేశ్వర నామ కోటి పుస్తకాలను అందిస్తాం. కళ్యాణకట్ట క్షురకులుకు ఇచ్చే పీస్ రేటును 11 నుంచి 15 రూపాయలకు పెంచాం.3 కోట్ల రూపాయల వ్యయంతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు చేస్తాం.10 కోట్ల రూపాయల వ్యయంతో స్విమ్స్ లో భవనాలు నిర్మాణం జరుగుతుంది.12 కోట్ల రూపాయల వ్యయంతో మహిళా యూనివర్సిటీ లో హస్టల్ భవనాలు నిర్మాణం చేస్తాం అని తెలిపారు.
తాజా వార్తలు
- తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా..బలపరీక్ష నెగ్గిన విజయ్ ప్రభుత్వం..
- పుదుచ్చేరి సీఎంగా రంగసామి రికార్డు
- గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!
- ఎస్టోనియా, డచ్ మంత్రులతో సయ్యద్ బదర్ చర్చలు..!!
- ప్రాంతీయ భద్రతా పై చర్చించిన సౌదీ, ఖతార్..!!
- ఇరాన్ తో సంబంధం ఉన్న సముద్ర చొరబాటుదారులు అరెస్ట్..!!
- 21 మంది వ్యక్తులు, సంస్థలను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన యూఏఈ..!!
- Metrash ద్వారా QPost ట్రాకింగ్ సేవలు..!!
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం









