తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- December 12, 2021 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా రోజువారి కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 26,625 శాంపిల్స్‌ పరీక్షించగా… 146 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మరో కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 189 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,78,288కు చేరుకోగా… రికవరీ కేసులు 6,70,435కు పెరిగాయి.ఇక, మృతుల సంఖ్య 4,007కు చేరినట్టు బులెటిన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,123 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. తాజా, కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 78 కొత్త కేసులు వెలుగు చూశాయి.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,హైదరాబాద్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com