భారత్ కరోనా అప్డేట్

- December 13, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భార‌త్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 8,55,692 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 7,350 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు సోమ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌3,46,97,860కి చేరింది. నిన్న ఒక్క రోజే 202 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 4,75,636కి చేరింది.

నిన్న7,973 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,41,30,768కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 91,456 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.37 శాతానికి చేరింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. నిన్న19,10,917 మందికి క‌రోనా వ్యాక్సిన్‌ను వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 1,33,17,84,462 కోట్ల‌కు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 65.66 ​కోట్ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com