హోర్ముజ్‌లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- June 17, 2026
మస్కట్: హోర్ముజ్‌లో సంబంధాలు, సముద్ర భద్రత బలోపేతం కోసం ఒమన్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ స్పష్టం చేశారు. ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీలో టెలిఫోన్ ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా మంచి పొరుగు సంబంధాలను కొనసాగించాలని, ప్రాంత ప్రజలను ఏకం చేసే చారిత్రక, సాంస్కృతిక బంధాల ఆధారంగా వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి ఉమ్మడిగా నిబద్ధతతో కృషి చేయాలని నిర్ణయించారు.
ఇటీవల కుదిరిన యూఎస్-ఇరాన్ అవగాహనల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన మరియు స్వేచ్ఛాయుతమైన సముద్రయానానికి సంబంధించిన అంతర్జాతీయ చట్టానికి తమ దేశాలు కట్టుబడి ఉంటామని ఇద్దరు మంత్రులు పునరుద్ఘాటించారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని కాపాడుతూ నిర్మాణాత్మక రాజకీయ, దౌత్య మార్గానికి అనుకూల వాతావరణాన్ని పెంపొందించేందుకు రాబోయే కాలంలో అన్ని పక్షాలు తీవ్రమైన, నిరంతర ప్రయత్నాలు చేస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!







