GCC విదేశాంగ మంత్రుల భేటీ.. సమ్మిట్ ఎజెండా ఖరారు
- December 13, 2021
సౌదీ: సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ నేతృత్వంలోని ఆరు జీసీసీ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ఆదివారం సమావేశమయ్యారు.డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న జీసీసీ వార్షిక సమ్మిట్ ఎజెండాను వారు ఖరారు చేశారు. సమిష్టి భద్రత, ప్రాంతీయ వివాదాలు, గల్ఫ్ ప్రాంత అభివృద్ధిని అజెండాలో ప్రధాన అంశాలుగా నిర్ణయించారు. ఈ సమావేశంలో ఈజిప్టు విదేశాంగ మంత్రి సమేహ్ షౌక్రీ, GCC సెక్రటరీ జనరల్ డాక్టర్ నయీఫ్ అల్-హజ్రఫ్ కూడా పాల్గొన్నారు.సౌదీ అరేబియాలో GCC 42వ సమ్మిట్ కింగ్ సల్మాన్ అధ్యక్షతన డిసెంబర్ 14న ప్రారంభం కానుంది. గల్ఫ్ దేశాల మధ్య సమన్వయం, ఏకీకరణ, ఆర్థిక, పరస్పర పురోగతిని చర్చించడానికి ఏటా ఈ జీసీసీ వార్షిక శిఖరాగ్ర సమ్మిట్ ను నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









