ముగిసిన అబుధాబి గ్రాండ్ ప్రిక్స్...హాజరైన షేక్ మహ్మద్

- December 13, 2021 , by Maagulf
ముగిసిన అబుధాబి గ్రాండ్ ప్రిక్స్...హాజరైన షేక్ మహ్మద్

యూఏఈ: యాస్ మెరీనా సర్క్యూట్‌లో ఆదివారం అబుధాబి గ్రాండ్ ప్రిక్స్(ఫార్ములా వన్ సీజన్) ఉత్కంఠభరితంగా ముగిసింది.ప్రతిష్టాత్మకమైన ఈ గ్రాండ్ ప్రిక్స్ ను వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్, అబుధాబి ప్రిన్స్ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ వీక్షించారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్, ఆ దేశ ప్రధాని కూడా గ్రాండ్ ప్రిక్స్ ను చూసిన వారిలో ఉన్నారు.అబుధాబి గ్రాండ్ ప్రిక్స్ ను చూసేందుకు వేలాది మంది ప్రేక్షకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా అల్ ఫుర్సాన్ వైమానిక ప్రదర్శన బృందం Aermacchi MB-339A జెట్‌లతో చేసిన విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ గ్రాండ్ ప్రిక్స్ లో ఎనిమిది ప్రపంచ టైటిళ్లను సాధించిన బ్రిటన్‌కు చెందిన లూయిస్ హామిల్టన్‌పై డచ్ స్టార్ మాక్స్ వెర్స్టాపెన్ చివరి ల్యాప్ లో అద్భుత విజయం సాధించి తన తొలి ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ రేసు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com