ఖతార్ వ్యాప్తంగా మరిన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు

- December 14, 2021 , by Maagulf
ఖతార్ వ్యాప్తంగా మరిన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు

ఖతార్: ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత దగ్గర కానున్నాయి. దేశవ్యాప్తంగా మరిన్ని  ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లను ప్రారంభించాలని  ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్(PHCC) భావిస్తోంది. 2022 ఫిబ్రవరిలో PHCC 10 సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం కొత్త సౌకర్యాలను ప్రజలకు అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుత అల్ ఖోర్ హెల్త్ సెంటర్‌తో పాటు అల్ మషాఫ్, ఉమ్ అల్ సెనీమ్, అల్ సద్‌లను PHCC కొత్త హెల్త్ కేర్ సెంటర్‌లలో చేర్చాలని భావిస్తున్నట్లు నిన్న విడుదల చేసిన వార్షిక నివేదికలో PHCC వెల్లడించింది. అయితే అధికారికంగా అల్ రువైస్ హెల్త్ సెంటర్‌,  సౌత్ వక్రా హెల్త్ సెంటర్ లను ప్రారంభించిన తర్వాతనే ఈ మార్పులు జరుగుతాయని నివేదిక పేర్కొంది. 2019 ఏప్రిల్‌లో PHCC కార్పొరేషన్ తన వ్యూహాత్మక ప్రణాళిక (2019-2023)ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 20 లక్ష్యాలు, 80 వ్యూహాత్మక కార్యకలాపాలను సాధించినట్లు నివేదిక వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com