వర్షాల కోసం ప్రార్థనలు...
- December 14, 2021
సౌదీ: సౌదీ అరేబియా అంతటా వర్షాల కోసం ప్రార్థనలు నిర్వహించారు. కరువు, వర్షాలు ఆలస్యమైన సమయంలో ప్రవక్త సంప్రదాయాన్ని అనుసరించి సోమవారం ఉదయం వర్షం కోరే (ఇస్తిస్కా) ప్రార్థనలు చేశారు. మక్కాలో, గ్రాండ్ మసీదులో జరిగిన ప్రార్థనలో రెండు హోలీ మస్జిదులకు సలహాదారుగా ఉన్న ప్రావిన్స్ ఎమిర్ ప్రిన్స్ ఖలీద్ అల్-ఫైసల్ హాజరయ్యారు. మదీనాలో, ప్రవక్త మసీదులో నిర్వహించిన ప్రార్థనలో ఎమిర్ ఆఫ్ ది రీజియన్ ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రియాద్‌లోని ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా మసీదులో జరిగిన ప్రార్థనలో డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ అబ్దుల్లాజీజ్ పాల్గొన్నారు. సౌదీ వ్యాప్తంగా జరిగిన ప్రార్థనల్లో గవర్నర్లు, అధికారులు, పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు.
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్‌లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







