బూస్టర్ డోస్ కు అంతా సిద్ధం. అర్హులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరిన ప్రభుత్వం

- December 14, 2021 , by Maagulf
బూస్టర్ డోస్ కు అంతా సిద్ధం. అర్హులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరిన ప్రభుత్వం

ఒమన్:  COVID-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి ఒమన్ ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలో అర్హులైన వారికి బూస్టర్ డోసులు వేయాలని నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా 18 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు బూస్టర్‌ డోసుల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఒమన్ సుల్తానేట్ లో కరోనా పాజిటివ్ కేసులలో స్వల్ప పెరుగుదలను ఎపిడెమియోలాజికల్ నివేదికలు సూచిస్తున్నాయి. అదే సమయంలో ఆసుపత్రిలో చేరడం, ఇంటెన్సివ్ కేర్ కేసులలో తగ్గుదలను నివేదికలు సూచించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com