ఇండోనేషియా లో పెను భూకంపం, ఇండియాకి సునామి హెచ్చరిక
- December 14, 2021
ఆగ్నేయ ఆసియా దేశం ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సముద్రంలో తలెత్తిన ఈ భూకంపం వల్ల సునామీ తలెత్తొచ్చని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. దాని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ ఐన వివరాలివి..
ద్వీపాల సముదాయమైన ఇండోనేషియాలో ప్రకృతి అంతాలకు నెలవైన ఫ్లోరెస్ దీవులకు సమీపంగా ఇవాళ భారీ భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 11.20 నిమిషాలకు భూకంపం వచ్చిందని అధికారులు చెప్పారు. ఫ్లోరెస్ ద్వీపంలోని అతిపెద్ద పట్టణం మౌమెరే తీరానికి ఉత్తరంగా 100 కిలోమీటర్ల దూరం భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సముద్రంలో 10కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇది తీవ్రమైన భూకంపం కావడంతో సునామీ అలలు తలెత్తొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇండోనేషియా లో పెను భూకంపం, ఇండియాకి సునామి హెచ్చరిక
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







