'రాధేశ్యామ్'లోని 'సంచారి' టీజర్
- December 14, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ప్రచార పర్వం జోరందుకుంది. డిసెంబర్ 16న విడుదల కాబోతున్న ‘సంచారి’ గీతానికి సంబంధించిన టీజర్ ను ప్రొడ్యూసర్స్ విడుదల చేశారు.
తెలుగులో 'సంచారి చలో చలో' అంటూ సాగే ఈ పాట హిందీలో 'ఉడ్ జా పరిందా' అంటూ మొదలైంది. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ టీజర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ విషయాన్ని ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపాడు. ఈ పాటతో కొత్త నేలపై సంచారి ప్రయాణం చూపించబోతున్నట్టుగా విడుదలైన టీజర్ బట్టి తెలుస్తోంది.
1970లో యూరప్ లో ఉండే విక్రమాదిత్య అనే పామిస్ట్ గా ప్రభాస్ నటిస్తుండగా, ప్రేరణ అనే ఫిజిషియన్ పాత్రను పూజా హెగ్డే పోషిస్తోంది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి కానుకగా వచ్చే యేడాది జనవరి 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు, టీజర్ మూవీని ఎంత భారీగా తీశారో చెప్పకనే చెబుతున్నాయి. 16వ తేదీ వచ్చే ఈ 'సంచారి' గీతం కూడా మూవీ మీద అంచనాలను భారీగా పెంచేలా ఉంటుందని అంటున్నారు. కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చిత్రి, కునాల్ రాయ్ కపూర్, భాగ్యశ్రీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









