బిగ్ బాస్ 5 గ్రాండ్ ఫినాలేకి అతిధులుగా పాన్ ఇండియా స్టార్ లు
- December 14, 2021
డిసెంబర్ 19న జరగబోయే బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలేకి చీఫ్ గెస్టులుగా బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపిక పదుకునేతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బాలీవుడ్ నటి అలియా భట్ లు హాజరుకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 3,4 లలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రావడంతో సీజన్ 5 కూడా చిరంజీవి వస్తారని మొదట వార్తలు వినిపించినా తాజాగా చిరు స్థానంలో రామ్ చరణ్ రాబోతున్నట్లు తెలుస్తుంది.
అయితే జనవరి 7న విడుదల కానున్న "ఆర్ఆర్ఆర్" సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్, అలియా భట్ లు గెస్టులుగా వస్తుండగా.., రణవీర్ సింగ్, దీపిక పదుకునే జంటగా నటించిన "83" సినిమా డిసెంబర్ 24న విడుదల అవుతుండటంతో పాటు ఈ సినిమాకి సంబంధించి తెలుగు రైట్స్ కింగ్ నాగార్జున సొంతం చేసుకోవడం కూడా బిగ్ బాస్ సీజన్ 5 కి ఈ స్టార్ కపుల్ గెస్టులుగా రావడానికి కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా చిత్రాల ప్రమోషన్ తో పాటు పాన్ ఇండియా స్టార్ లు అతిధులుగా విచ్చేస్తుండటంతో ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ తో రికార్డులు బద్దలుకొట్టబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







