డిసెంబర్ 19 నుంచి కోవిడ్ 19 యెల్లో అలర్ట్
- December 15, 2021
బహ్రెయిన్: డిసెంబర్ 19 నుంచి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా యెల్లో అలర్ట్ అమల్లో వుంటుందని బహ్రెయిన్ పేర్కొంది. జనవరి 31 వరకు ఈ యెల్లో అలర్ట్ కొనసాగుతుంది. యెల్లో అలర్ట్ విషయానికొస్తే, ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఏడు రోజులపాటు 51 నుంచి 100 కేసులు నమోదయినప్పుడు ఈ అలర్ట్ జారీ చేస్తారు. కాగా, బూస్టర్ డోసుల్ని తీసుకోవాల్సిందిగా పౌరులు, నివాసితులకు టాస్క్ ఫోర్స్ సూచిస్తోంది. యెల్లో అలర్ట్ లెవల్ ప్రకారం కేవలం వ్యాక్సిన్ పొందినవారు మాత్రమే పబ్లిక్ ప్రాంతాలు (షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, కేఫ్‌లు, బార్బర్ షాపులు, ఇండోర్ జిమ్‌లు, క్రీడలకు సంబంధించిన హాల్స్)లోకి ప్రవేశించేందుకు అర్హత కలిగి వుంటారు. బూస్టర్ డోస్ తీసుకున్నవారు, గ్రీన్ అలర్ట్ లెవల్ సూచనల ప్రకారం వ్యవహరించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- HR88B8888 నంబర్‌కు అపార డిమాండ్
- హైదరాబాద్: సస్పెండ్ చేసిన ఎస్ఐ పై షాకింగ్ నిజాలు
- లోక్‌సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?







