అడ్మిన్స్ కు ఊరట కలిగించే కొత్త ఫీచర్
- December 17, 2021
రోజు రోజుకీ వాట్సాప్ ను వినియోగించే వాళ్ల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ప్రముఖ మెసేజింగ్ యాప్స్ లో ఒకటైన వాట్సాప్ యూజర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో ఫీచర్స్ ని తీసుకు వస్తుంది.
పైగా వాట్సాప్ గ్రూప్స్ వినియోగం కూడా అంతకంతకూ పెరుగుతోంది. చాలా సందర్భాల్లో వాట్సాప్ గ్రూప్ లోని సభ్యులు పోస్ట్ చేసే పోస్టుల వల్ల అడ్మిన్స్ కు చాలా సమస్యలు వస్తాయి. అయితే ఈ కొత్త ఫీచర్ వల్ల కాస్త రిలీఫ్ ని అడ్మిన్స్ పొందొచ్చు. ఇక ఈ కొత్త ఫీచర్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. సాధారణంగా గ్రూప్ లో ఏదైనా మెసేజ్ ను డిలీట్ చేయాలంటే మెసేజ్ పంపిన వ్యక్తి మాత్రమే డిలీట్ చేయడం అవుతుంది.
అయితే ఆ సందర్భాలలో అడ్మిన్స్ కు ఇబ్బందులు ఎదురు కాకుండా వాట్సాప్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. అడ్మిన్ లు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే మెసేజ్ లను డిలీట్ చేయవచ్చు ఈ కొత్త ఫీచర్ తో. ఈ ఫీచర్ త్వరలోనే రానుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో ఈ విషయాన్ని తెలిపింది.
గ్రూప్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న మెసేజ్లను, అభ్యంతరకంగా ఉన్న మెసేజ్స్ ని గ్రూప్ అడ్మిన్స్ ఇక నుండి ఈజీగా డిలేట్ చెయ్యచ్చు. ఈ ఫీచర్ ద్వారా 16 సెకన్లు, 8 నిమిషాలు, గంటలో మెసేజ్ ను డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. వాట్సాప్ ఈ ఫీచర్ తో పాటు డిలీట్ మెసేజ్ ఫర్ ఎవ్రీవన్ అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







