‘ఖలీఫా’ ఆధ్వర్యంలో 2 మిలియన్ ఇఫ్తార్ మీల్స్
- June 08, 2015
పవిత్ర రమదాన్ మాసాన్ని పురస్కరించుకుని ది ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్ ఫౌండేషన్ 2 మిలియన్ ఇఫ్తార్ మీల్స్ని ముస్లిం సోదరులకు అందించనుంది. మొత్తం 105 లొకేషన్స్లో రమదాన్ అంతటా ఈ ఇఫ్తార్ మీల్స్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఫౌండేషన్ ప్రతినిథులు చెప్పారు. ఇప్పటికే ఈ మెగా ఛారిటీ కోసం ఏర్పాట్లు మొదలు పెట్టిన ఫౌండేషన్, పేద వారికి పవిత్ర రమదాన్ మాసంలో సరైన భోజనం ఇచ్చేందుకు ఈ పని చేస్తున్నట్లు చెబుతోంది. ఖలీఫా ఫౌండేషన్ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ హజి అల్ ఖౌరీ చెబుతూ ఇస్లాం బోధనలకు అనుగుణంగా ఈ ఇఫ్తార్ మీల్స్ ఛారిటీని చేపట్టామనీ, దేశమంతటా రమదాన్ మాసంలో ఇఫ్తార్ మీల్స్ ఎంపిక చేసిన చోట్ల అందించనున్నందున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







