ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త...
- December 19, 2021
ముంబై: భారత్‌లో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ ఖాతాదారులకు 3 ఇన్ 1 ఖాతా పేరుతో సరికొత్త సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. దీంతో సేవింగ్స్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలను అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఖాతా వల్ల ట్రేడింగ్ చేసే వారికి ప్రయోజనం చేకూరుతుందని ఎస్బీఐ పేర్కొంది. 3 ఇన్ 1 ఖాతాతో వినియోగదారులు మూడు రకాల సదుపాయాలను పొందుతారని సూచించింది.
మరోవైపు ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది.బేస్ రేట్‌ను 0.10 శాతం లేదా 10 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. సవరించిన రేటు ప్రకారం 2021 డిసెంబర్ 15 నుంచి వార్షికంగా 7.55 శాతం వడ్డీ ఇస్తామని ఎస్బీఐ తెలిపింది. అయితే ఈ వడ్డీ రేట్లు రూ.2 కోట్లకు పైగా చేసే డిపాజిట్లపైనే వర్తిస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రవాస కార్మికుల నైపుణ్యాల మెరుగు పై సమీక్ష..!!
- విజిట్ వీసాలను రెగ్యులర్ రెసిడెన్సీగా మార్చుకోవచ్చా?
- కేరళ-యూఏఈ విమానం దారి మళ్లింపు..!!
- కటారా ఫాల్కన్రీ, హంటింగ్ ఛాంపియన్షిప్..!!
- ఒక నెలలో 300 మందిని బహిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో పౌరులు, నివాసితుల సెలవుల ప్రణాళికలు..!!
- 48 గంటల్లో కొత్త తుఫాన్?
- సీఎం చంద్రబాబు ఆదేశాలు: ప్లాస్టిక్ డిస్పోజల్‌లో మార్పులు అవసరం
- సాధారణ పరిస్థితుల్లో ఓరల్ మెన్షనింగ్ లేదు: CJI సూర్యకాంత్
- సిమెంట్ ఫ్యాక్టరీ, సైనిక్ స్కూల్,కొడంగల్ పై సీఎం రేవంత్ వారలు







